GM Diet Plan in Telugu

మీరు అధిక బరువుతొ బాధపదుతున్నారా? ఐతె మీరు సరైన చోటికి వచారు. ఈ GM డైట్ చెయడం వలన ఒక్క వారంలో మీరు కనీసం 5 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గుతారు. ఒకవేల మీరు ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే, ఒక వారం రోజులు తర్వాత ఈ డైట్ ను మళ్ళీ ఫాలొ అవ్వచు. ఇలా మీరు మొత్తం బరువు తగ్గేవరకు కొనసాగించవచు.

GM Diet in Telugu Language

మొదటి రోజు

అరటి పండు తప్పించి మీరు అన్ని రకాల ఫ్రూట్సు తినవఛు. ఎక్కువుగా పుచకాయలు తినడం వలన ఎక్కువ బరువు తగ్గుతారు. వీటితొ పాటుగా రోజులొ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి.

రెండవ రోజు

అన్ని రకముల కూరగాయలు తినవచు. కాని బంగాలదుంప మాత్రం రోజులొ ఒక్క సారి మాత్రమే తినవలెను. ఆది కూడా బ్రేక్ఫాస్త్ సమయంలొ 2 చిన్న బంగాలదుంపలు ఉడకబెట్టుకుని తినవలెను. మీరు కూరగాయలను పఛివిగా కాని బాఇల్ చేసుకుని కాని తినవఛు.

మూడవ రోజు

ఈరోజు మీరు అన్ని రకాల ఫ్రూట్సు మరియు కూరగాయలు తినవచు. కాని బంగాలదుంప మరియు అరటి పండు మాత్రం తినకూడదు.

నాల్గవ రోజు

ఈరోజు 4 చిన్నవి లేక 6 పెద్ద అరటి పండ్లు తినవచు. వాటితొ పాటుగా 500 ml (అర లీటర్) పాలు కూడా త్రాగవలెను. ఈరోజు మొదలుకుని మీరు రోజుకి రెండు సార్లు కేబేజి సూప్ తాగవలెను.

ఐదవ రోజు

షాకాహారులకు

మీరు కనక షాకాహారులైతే ఈరోజు బ్రౌన్ రైస్ మరియు 6 టమాటొలు తినవలెను. బ్రౌన్ రైస్ దొరకకపొఇనా లేక నచకపొఇనా దానిబదులుగా పనీర్ ని తినవచును. ఆకలి వేసినపుడు కేబెజి సూప్ తాగవలెను.

మాంసాహారులకు

మీరు అర కేజి బొన్లెస్ చికెన్ లేదా మేక లేదా చేప ను తినవలెను. దానితొ పాటుగా 6 టమాటొలు తినవలెను. ఆకలి వేసినపుడు కేబెజి సూప్ తాగవలెను.

ఆరవ రోజు

షాకాహారులకు

మీరు కనక షాకాహారులైతే ఈరోజు బ్రౌన్ రైస్ మరియు కూరగాయలు తినవచు. టమాటొ & బంగాలదుంప మాత్రం తినకూడదు. ఆకలి వేసినపుడు కేబెజి సూప్ తాగవలెను.

మాంసాహారులకు

మీరు అర కేజి బొన్లెస్ చికెన్ లేదా మేక లేదా చేప ను తినవలెను. కుదిరితే చికెన్ సూప్ చేసుకొవచు. వెజ్ సలాడ్ మాత్రం తప్పనిసరిగా తినవలెను. ఆకలి వేసినపుడు కేబేజి సూప్ తాగవలెను.

ఏడవ రోజు

ఈరోజు మీరు బ్రౌన్ రైస్ తప్పనిసరిగా తినవలెను. మొలకెత్తిన పెసలు మరియు నచిన కూరగాయలు వేసుకుని ఫలావ్ తయారుచేసుకొండి. దానితో పాటు మీకు ఇష్ఠమైన పల్ల రసాలు తాగండి. ఆకలి వేసినపుడు కేబెజి సూప్ తాగవలెను.

మీరు కనుక ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ డైట్ ఫాలొ ఐతే కనీసం 5 నుంచి 7 కేజిలు బరువు తగ్గుతారు.

గుర్తుపెట్టుకొవల్సిన విషయాలు

  • రోజుకి కనీసం 2 నుంచి 3 లిటర్ల నీరు తాగవలెను.
  • మద్యపానం జోలికి పోకూడదు.
  • చిరు తిండ్లు మరియు ఆయిల్ ఎక్కువ వేసిన ఆహారం తినకూడదు.
  • కుదిరితే రోజుకి కనీసం 30 నిముషాలు వ్యాయాయం చేయవలెను.
  • కేబేజి సూపు తప్పకుండా త్రాగవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *